వైసీపీ నేత హరికృష్ణ రెడ్డికి రిమాండ్
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత హరికృష్ణ రెడ్డి(Harikrishnareddy) వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత హరికృష్ణ రెడ్డి(Harikrishnareddy) వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని.. జిల్లా కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు హరికృష్ణ రెడ్డికి 14 రోజుల రిమాండ్(Remand) విధించింది. అనంతరం వైద్య పరీక్షల అనంతరం అతన్ని పోలీసులు జైలుకు తరలించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అసత్యాలు మితిమీరడం, మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తుండటంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇకపై అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని.. ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్ భారతి పీఎను అరెస్టు చేయగా.. ఎంపీ భరత్ పీఏ కోసం పోలీసులు గాలిస్తున్నారు.