Ap News: వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించింది...
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి(AP Fiber Net Former Chairman Gautham Reddy)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో రిలీఫ్ దొరికింది. హత్యాయత్నం కేసు(Murder Attempted Case)లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు సైతం ఇచ్చారు. అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఊరట లభించింది. తనపై ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో గౌతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి అభ్యర్థనతో ఏకీభవించింది. తదుపరి విచారణకు వరకూ ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ప్రభుత్వానికి, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది.
విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డిపై కిరాయి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాక పలు కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.