ప్రైవేటీకరణ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్..? ఈ రోజు కీలక మీటింగ్‌

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు సర్కార్ ఒక్కో అడుగూ ముందుకు వేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Update: 2024-09-10 03:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel Plant) ప్రైవీటీకరణ అవకాశమే లేదు.. కొద్ది రోజుల క్రితం కేంద్ర స్టీల్‌ మంత్రి కుమారస్వామి (Kumaraswamy) అన్న మాటలివి. ‘45 రోజుల్లో అన్నీ చక్కదిద్దబడతాయి. ప్లాంట్‌ ప్రయివేటీకరణ ప్రశ్నేలేదు’ అని అందరికీ హామీ ఇచ్చి వెళ్లారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు చూస్తే మాత్రం ప్రైవేటీకరణ వైపు ఒక్కో అడుగూ స్టీల్ ప్లాంట్‌ వైపు వేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఢిల్లీ (Delhi)లో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక మీటింగ్ ఈరోజు (మంగళవారం) జరగనుండగా.. దానికంటే ముందే ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సీఎండీగా ఉన్న అతుల్‌ భట్‌ను విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం.. రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అదే టైంలో ప్రస్తుతం వున్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది. దీంతో ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే సైలెంట్‌గా ప్లాంట్ ప్రేవేటైజేషన్ (Privatisation) వైపు అడుగులు వేస్తున్నారని కార్మికులు అంటున్నారు. ఇప్పటికే ప్లాంట్‌లో ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయని, ప్లాంట్‌లో ఇప్పటివరకు 19 వేల పైగా ఉన్న కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరికల్లా 8 వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ఇది ఉత్పత్తి (Production)పై తీవ్ర దుష్ప్రభావం చూపతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మికులు.. తాజాగా సీఎండీని తప్పించడంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు వెళుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దానికి తోడు 2025 నాటికి 2500 మందికి వీఆర్‌ఎస్‌ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందని, ఇందుకోసం యాజమాన్యం ఇప్పటికే రూ.1260 కోట్లు సిద్ధం చేసినట్లు ప్రకటించిందని అంటున్న కార్మికులు (Workers).. నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ యాజమాన్యం 500 మందిని డిప్యుటేషన్‌పై పంపేయాలని నిర్ణయించడం చూస్తే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఖాళీ చేయాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రోజు జరగబోతున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Read More:

విశాఖ స్టీల్ వద్ద ఉద్రిక్తత..హైవేను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు  


Similar News