AP News:మహిళలు, మిస్సింగ్ కేసుల పై ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ
మహిళలు, మిస్సింగ్, 174 సీఆర్పీసీ కేసులు పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప శివ కిషోర్ 2019 బ్యాచ్ ఐపీఎస్‌గా విధుల్లో చేరారు.
దిశ, ఏలూరు:మహిళలు, మిస్సింగ్, 174 సీఆర్పీసీ కేసులు పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప శివ కిషోర్ 2019 బ్యాచ్ ఐపీఎస్‌గా విధుల్లో చేరారు. ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్ సిల్వర్ కప్‌కు ఎంపికైన ఆయన సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర పరిస్థితిలో 112, జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ 9550351100కు 24/7 అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై త్వరితగతిన దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ డే నిర్వహించిన కాలపరిమితిలోపు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి రవాణా, మద్యం, నాటు సారా అక్రమ రవాణా జరగకుండా చూస్తామన్నారు. సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంచేందుకు, కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించేలా తర్పీదు ఇస్తామని తెలిపారు.