YS Sharmila:కూటమి ప్రభుత్వం ఆ విషయం పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అయింది. మరి మీ సూపర్ సిక్స్ ఎక్కడ? అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

Update: 2024-12-04 12:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అయింది. మరి మీ సూపర్ సిక్స్ ఎక్కడ? అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అమలు కాదు కదా.. విధి విధానాలు కూడా లేవు, సూపర్ సిక్స్ పథకాలని కాలయాపన చేస్తున్నారు అని ఆమె విమర్శించారు. సూపర్ సిక్స్ ప్రకటన చేసే నాటికి వైఎస్ జగన్ 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు. ఆ విషయం చంద్రబాబుకి తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. రైతుకి 20 వేల ఆర్థిక సహాయం అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. మహాశక్తి విధి విధానాలు ఏంటో తెలియదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. 6 నెలలు దాటినా ఉచిత బస్సు పథకం పై చిత్తశుద్ది లేదు. సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం 6 నెలల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు.. సంజాయిషీ ఇచ్చుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు.

మాజీ సీఎం జగన్‌కి 1750 కోట్లు ముడుపులు తీసుకున్నారని, ఈ అంశం అమెరికా కోర్టులో కేసు నమోదు అయిందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవు. సీఎం చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తడం లేదు అని ఆమె చెప్పారు. ఈ క్రమంలో జగన్‌కి చంద్రబాబుకి ఏమిటి తేడా? అంటూ ఆమె నిలదీశారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. ‘వైఎస్ జగన్ రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు. నా పేరు లేదు అని అతి తెలివిగా మాట్లాడాడు. నా పేరు ఎవరైనా చెప్పారా అంటున్నాడు.. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా?’ అంటూ ఆమె మండిపడ్డారు.

వైఎస్ జగన్ గారు అధికారంలో వచ్చాకా చంద్రబాబు చేసిన ఒప్పందాలు రద్దు చేశారని ఆమె గుర్తు చేశారు. లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఉండకూడదు అన్నారు.. మరీ ఇప్పుడు జగన్ గారు ఎందుకు 25 ఏళ్లకు అదానీతో ఒప్పందం చేశారని ఆమె ప్రశ్నించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళన చేసింది. కోర్టులో కూడా కేసులు వేసింది, దీని పై పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు.. మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా! ఈ విషయం పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వైఎస్ షర్మిల నిలదీశారు. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు జగన్ చేసిన డీల్స్ రద్దు చేయలేదు అంటే.. అవి సక్రమం అని ఒప్పుకుంటారా? ఈ డీల్ పై చంద్రబాబు మౌనం వహిస్తే.. ప్రజలు క్షమించరని ఆమె పేర్కొన్నారు. వెంటనే డీల్ ను క్యాన్సిల్ చేయండి.. అదానీ తో చేసుకున్న ఒప్పందాలపై పరిశీలన చేయాలని సెంట్రల్ ERCకి లేఖ రాస్తున్నాం అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

Also Read:

నామినేటెడ్ పోస్టులకు పెరిగిన తాకిడి.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే..! 

Tags:    

Similar News