Smuggling: పుష్ప స్టైల్లో ఎర్రచందనం స్మగ్లింగ్.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
పుష్ప సినిమా (Pushpa Movie)లో చూపింనట్లుగా కొందరు అక్రమార్కులు ఎర్రచందనం (Red Sandalwood) దుంగలను యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప సినిమా (Pushpa Movie)లో చూపింనట్లుగా కొందరు అక్రమార్కులు ఎర్రచందనం (Red Sandalwood) దుంగలను యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్నారు. తమను ఎవరు పట్టుకుంటారులే అన్నట్లుగా గుట్టచప్పుడు కాకుండా రూ.లక్షలు విలువ చేసే ఎర్రచందనాన్ని అక్రమంగా దేశం దాటిస్తున్న గ్యాంగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎర్రచందనాన్ని (Red Sandalwood) అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన మంగళగిరి (Mangalagiri) పోలీసులు అన్ని చెక్‌పోస్టుల (Check Posts) వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే చెన్నై (Chennai) నుంచి విశాఖపట్నం (Vishakhapatnam) వైపు వెళ్తున్న ఓ లారీని తనిఖీ చేయగా.. పేపర్ బండిళ్ల మధ్య 10 టన్నుల ఎర్రచందనాన్ని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు సరుకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.