ఉండేదెవరు?ఊడేదెవరు?: సీఎం జగన్‌ సమీక్షపై ఎమ్మెల్యేల్లో టెన్షన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.

Update: 2023-09-26 05:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే వైసీపీ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో ఏడాది కాలంగా ప్రజల్లోనే ఉంటుంది. దాంతోపాటు అనేక కార్యక్రమాలతో సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యచరణ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ కార్యక్రమంపై సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుని మరీ దిశానిర్దేశం చేస్తోంది. ప్రజల్లో ఉండని ఎమ్మెల్యేలకు పనితీరు మార్చుకోమని ఇప్పటికే హెచ్చరించారు. 27 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వమని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సీన్ వేరేలా ఉంది. టీడీపీ-జనసేన పొత్తు కన్ఫర్మ్ కావడంతో వైనాట్ 175 అనేది అంత ఈజీగా అయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో సీఎం వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నాం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇస్తారో ఇవ్వరో అనేది తేల్చనునన్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ టీంలో ఎవరు ఉంటారు..?ఎవరు ఊడతారు? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఎమ్మెల్యేల్లో గుబులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వీరి పని తీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఇప్పటికే జగన్ కు నివేదికలు అందాయి. అయితే ఈ సమీక్ష వాడీ వేడిగా ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చేది ఇవ్వరనేది ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం వైఎస్ జగన్‌కు ఇప్పటికే నివేదిక అందింది. ఈ నివేదికపై తొలుత సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు సీఎం వద్దకు చేరాయి. ఈ నేపథ్యంలో ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో! అధినేత వైఎస్ జగన్ తమ పట్ల ఎలా వ్యవహరిస్తారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు పట్టుకుంది.

వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఎమ్మెల్యే ప్రతీ గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి అని సూచించారు. అంతేకాదు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు వారికేమైనా సంక్షేమ పథకాలు అందాల్సి ఉంటే వాటి సమస్యలను పరిష్కరించడం బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు అభ్యర్థించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే సైతం చేపట్టారు. మరోవైపు ఐప్యాక్ సర్వేను సైతం నిర్వహించారు. ఈ నివేదికల ఆధారంగా సమీక్షలు నిర్వహించి ప్రజల్లో తిరగలేని ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు ఇవ్వడం తరచుగా జరుగుతూనే ఉంది. సర్వే రిపోర్టుల్లో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోతే పద్ధతి మార్చుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లాలని కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో కొంత మంది ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. మరికొంతమంది 60 నుంచి 70 శాతం మాత్రమే పూర్తి చేశారు. దీంతో టార్గెట్ పూర్తి చేయని ఎమ్మెల్యేల పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 27 మంది ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తితో ఉన్న సీఎం వైఎస్ జగన్ వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో టీడీపీకి సానుభూతి పెరగడం, టీడీపీ-జనసేనల మధ్య పొత్తు కుదరడంతో పలు నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అనుకుంటున్న వైనాట్ 175 అనేది అంత ఈజీ కాదు అన్నట్లు భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ నేటి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎవరు ఉంటారో ఎవరు ఊడుతారో కూడా చెప్పేస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే ఎమ్మెల్యే భవిష్యత్తు అనేది మరికాసేపట్లో తేలిపోనుందన్నమాట. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలియక తలలు పట్టుకుంటున్నారట.

More News : కేసీఆర్‌కి ఓటు, ఆంధ్రప్రదేశ్‌కి చేటు!

Tags:    

Similar News