Riots: ఆంధ్రాలో కొనసాగుతున్న 144 సెక్షన్.. అల్లర్లకు కారకులు ఎవరు..?

ఏపీలో ఎన్నికలు ముగిసినా, నేటికి రాష్ట్రం దాడులు, ప్రతి దాడులతో అట్టుడుకుతోంది.

Update: 2024-05-18 09:16 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికలు ముగిసినా, నేటికి రాష్ట్రం దాడులు, ప్రతి దాడులతో అట్టుడుకుతోంది. పలు జిల్లాల్లో 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. దీనితో పలు ప్రాంతాల్లో భయాందోళనకు గురైన ప్రజలు ఇల్లు దాటి బయటకు రావడంలేదు. కొన్ని చోట్ల ప్రత్యర్థులకు ఓటు వేశారని ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా విచక్షణారహితంగా దాటి చేసిన ఘటనలు కూడా వెలుగు చూసాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన వ్యక్తికి ఓటు వేసే హక్కు కూడా తమకి లేదా..? అలాంటప్పుడు ఎందుకు ఎన్నికలను నిర్వహించడం..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రాలో అల్లర్లకు కారణాలేంటి..?

ఆంధ్రాలో అల్లర్లకు ప్రధాన కారణం స్వార్థపూరిత రాజకీయాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కడైతే తమ పార్టీకి ఓటమి తప్పదని నేతలు విశ్వసించారో ఆ ప్రాంతంలో అల్లర్లకు తెరలేపారు. ఇలా చేయడం వల్ల ఓటర్లు బయపడి ఓటు వేసేందుకు రారు. దీని కారణంగా ప్రత్యర్థికి వచ్చే ఓట్లు తగ్గుతాయి అనే ఉద్దేశ్యంతోనే పలు ప్రాంతాల్లో పోలింగ్ రోజు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిచారని, అలానే ఇంకా ఓట్లు లెక్కింపు జరగలేదు కనుక రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అల్లర్లు కొనసాగిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.

అసలు అల్లర్లకు కారకులు ఎవరు..?

పోలింగ్ రోజున పలు చోట్ల వైసీపీ నేతలే మొదటగా కవ్వింపు చర్యలకు దిగారని, అలానే టీడీపీ, జనసేన వర్గీయులపై దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఘర్షనలు చోటు చేసుకున్నట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు కావాలనే ఘర్షణలకు తెరలేపారు అనడానికి వైసీపీ ఎమ్మెల్మే అభ్యర్థి ఓటరుపై దాడి చేయడమే నిదర్శనం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలింగ్ పూర్తైన తరువాత కూడా, టీడీపీకి ఓటు వేశారనే కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ కార్యకర్త విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన నిన్న విశాకపట్నంలో వెలుగు చూసింది. 

Read More..

గుంటూరులో దారుణం.. వీధి కుక్కను కత్తితో పొడిచి చంపిన యువకుడు

Tags:    

Similar News