AP News:లాయర్ అవతారమెత్తిన మాజీ మంత్రి.. కారణం ఏంటంటే!?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati rambabu) నల్లకోటు వేసుకుని న్యాయవాది అవతారమెత్తారు.
దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati rambabu) నల్లకోటు వేసుకుని న్యాయవాది అవతారమెత్తారు. నేడు(సోమవారం) తాను ఇచ్చిన ఫిర్యాదు పై హైకోర్టు(High Court)లో ఆయనే వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో తనను, మాజీ సీఎం జగన్(Former CM Jagan)ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యల కోసం హైకోర్టులో అంబటి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నా పై, నా కుటుంబ సభ్యుల పైన తప్పుడు ప్రచారం చేస్తూ.. అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
సోషల్ మీడియా(Social Media)లో పోస్టుల పైన పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చానని తెలిపారు. నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల పోలీసులు వివక్ష చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. నా ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించండని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అంబటి రాంబాబు(Ambati Rambabu) కోరారు. తాను ఇచ్చిన ఫిర్యాదు పై ఇన్ పర్సన్‌గా కోర్టులో వాదనలు వినిపించారు. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.