తిరుమలలో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..కారణం ఏంటంటే?

తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.అయితే ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Update: 2024-03-31 14:20 GMT

దిశ,వెబ్ డెస్క్:తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.అయితే ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే రెండో తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.ఈ సమయంలో ఆ వారంలో వచ్చే మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచి శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ సమయంలో స్వామి వారి మూలవిరాట్టు వస్త్రంతో కప్పి ఉంచుతారు.ఆలయ శుద్ధి తర్వాత మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.


Similar News