Pawan Kalyan: అందరూ ఇలా తెల్ల గెడ్డంతో పుట్టరు కదా?
గోదావరి జిల్లాలను విముక్తం చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అసాధ్యమేమీ కాదని పవన్ వ్యాఖ్యానించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ‘యుద్ధం మొదలుపెట్టినప్పుడు ముందుగా చిన్న చిన్న కోటలు కొట్టాలి. శివాజీ మహారాజ్ కూడా చిన్న చిన్న గెరిల్లా తరహా యుద్ధాలు చేసి చిన్న ప్రాంతాలను మొదట స్వాధీనం చేసుకున్న తర్వాతే రాజ్యం సాధించాడు. మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్లాం. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త ప్రాంతాలుగా చేద్దాం.ఇక్కడున్న 34 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవకూడదు’ అని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నరసాపురంలో సోమవారం పార్టీ నాయకులు , కార్యకర్తలు , స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన గెలుపొందేలా జనసైనికులు , జనసేన నాయకులు బలంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలను విముక్తం చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అసాధ్యమేమీ కాదని వ్యాఖ్యానించారు. ‘పుట్టి పుట్టగానే అంతా నాయకులు అయిపోలేరు. వైవీ సుబ్బారెడ్డిలాగా తెల్ల గెడ్డంతో పుట్టరు కదా?. జగన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా పుట్టలేదు కదా? ముఖ్యమంత్రి కాకముందు ఆయన చేయాల్సిన దారుణాలన్నీ చేశారు. ఎస్ఐని కూడా కొట్టారు. కడప జిల్లాలో ఆయన ఫ్రెండ్స్ వేటకు వెళ్తే పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఎస్ఐని లోపలేసి కొట్టిన వ్యక్తి వైఎస్ జగన్. ఇప్పుడు వైసీపీ నాయకులు , వారి పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఎస్సీ , డీఎస్పీలను కొడుతున్నారు.’ అని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.
అయితే జనసేన అందుకు భిన్నంగా బాధ్యతగా ముందుకు వెళ్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. చట్టాల మీద గౌరవం, భయం లేని వారు మనల్ని పాలించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజల్ని యధేచ్చగా దోచుకుంటూ హక్కుల్ని కాలరాస్తామంటే కుదరదన్నారు. బాపట్లలో 15 ఏళ్ల కుర్రాడిని తోటలోకి తీసుకువెళ్లి కాల్చేస్తే పోలీసులు స్పందించలేదని జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
KotamReddy: నన్ను కుంటోడిని చేశావ్.. అనిల్ నిన్ను వదలను!
డైరెక్టర్ సుజిత్‌కు పవన్ కల్యాణ్స్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ‘OG’ అలా ఉండాలంటూ..!