AP News : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌(Vizag Steel Plant) ప్రైవేటీకరణపై కేంద్ర భారీ పరిశ్రమలశాఖ సహాయక మంత్రి శ్రీనివాస్‌వర్మ(Union Minister Srinivasvarma) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-10 14:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌(Vizag Steel Plant) ప్రైవేటీకరణపై కేంద్ర భారీ పరిశ్రమలశాఖ సహాయక మంత్రి శ్రీనివాస్‌వర్మ(Union Minister Srinivasvarma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కేంద్రమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌ కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చేసే దిశగా మాత్రమే కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలిపారు. నష్టాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునే బాధ్యత ప్రతీ తెలుగు వ్యక్తిపై ఉందన్నారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్(Bhadrachalam-Kovvuru RailwayLine) నిర్మాణం సత్తుపల్లి వరకు పూర్తయిందని, మిగతాది త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం(Polavaram) పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నాయని.. గత రెండు నెలలుగా పోలవరం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని శ్రీనివాస్‌వర్మ వెల్లడించారు.        

Tags:    

Similar News