పవన్ టార్గెట్‌గా అంబటి విమర్శలు.. లక్ష ఇవ్వొచ్చంటూ పృథ్వీరాజు స్ట్రాంగ్ కౌంటర్
మంత్రి అంబటిపై జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ సెటైర్లు వేశారు. ...
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఆ పార్టీ అధినేతలపై చేస్తున్న విమర్శలకు నేతలు పరస్పరం స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. సీఎం జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తుంటే.. ఇందుకు వైసీపీ నేతలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ పెళ్లిళ్లను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా మంత్రులు, జనసేన నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో రాజకీయ కాకపుట్టిస్తున్నారు. ఇక అంబటి రాంబాబు అయితే పవన్‌పై నోరేసుకుని పడిపోతున్నారు. మైక్ ముందు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించినప్పటి నుంచి పవన్ కల్యాణ్‌ను అంబటి టార్గెట్ చేశారు. తాజా రాజకీయ పరిణామాలపైనా పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు మరోసారి సెటైర్లు వేశారు.
దీంతో మంత్రి అంబటిపై జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ సెటైర్లు వేశారు. అమలాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల తర్వాత సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లతో పాటు అంబటిని కూడా ఆహ్వానించవచ్చని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 17 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ఇక పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తున్న అంబటికి పృథ్వీ స్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ పెళ్లిళ్లతో పోలవరం ఆగిపోయిందా..? అని దెప్పిపొడిచారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం వల్ల అమలాపురం రోడ్ల అభివృద్ధి ఆగిపోయిందా? అని పృథ్వీ ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్‌కు వేలు చూపించిన రోజాను అసలు వదిలి పెట్టవద్దని జనసేన కార్యకర్తలకు, అభిమానులకు పృథ్వీరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.