Jeelugumilli: నలుగురు నకిలీ పోలీసులు అరెస్ట్

రహదారిపై మాటు వేసి పోలీసులమని బెదిరించి లక్షా 20 వేలు తీసుకువెళ్లిన సంఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు...

Update: 2023-03-13 15:17 GMT
Jeelugumilli: నలుగురు నకిలీ పోలీసులు అరెస్ట్
  • whatsapp icon

దిశ, జంగారెడ్డిగూడెం: రహదారిపై మాటు వేసి పోలీసులమని బెదిరించి లక్షా 20 వేలు తీసుకువెళ్లిన సంఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మళ్లీపూడి రాజశేఖర్ ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం నిమిత్తం వెళ్లి వస్తుండగా జీలుగుమిల్లి వద్ద నలుగురు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులమని చెప్పి డమ్మీ తుపాకీ చూపించి డబ్బులు ఎత్తుకెళ్తారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల్లాది దుర్గారావు, కవల రోహిత్, మల్లాది సునీల్ మన్యం అరవింద్‌ను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News