Ap Government: రెండుగా ఏలూరు మండలం.. విభజిస్తూ నోటిఫికేషన్

ఏలూరు మండలం రెండుగా ఏర్పడింది. ఏలూరు రూరల్ మండలం ఒకటికాగా.. రెండోది ఏలూరు అర్బన్ మండలం. 21 గ్రామాలతో ఉన్న ఏలూరు మండలాన్ని ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రెండుగా విభజించింది...

Update: 2023-06-15 16:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు మండలం రెండుగా ఏర్పడింది. ఏలూరు రూరల్ మండలం ఒకటికాగా.. రెండోది ఏలూరు అర్బన్ మండలం. 21 గ్రామాలతో ఉన్న ఏలూరు మండలాన్ని ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రెండుగా విభజించింది. 13 గ్రామాలతో ఏలూరు రూరల్ మండలాన్ని, 8 గ్రామాలతో ఏలూరు అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో రెండు మండలాల్లో పరిపాలన సులువు కానుంది. 1925లో పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ జిల్లాకు ఏలూరు హెడ్ క్వార్టర్‌‌గా ఉంది. 2019లో సీఎం జగన్ కావడంతో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా జిల్లాలను పునర్విభజన చేశారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా ఏర్పడింది. ఏలూరు జిల్లాలకు 21 గ్రామాలతో ఉన్న ఏలూరు మండలం హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పుడు ఏలూరు మండలం రెండుగా ఏర్పడింది. 

Tags:    

Similar News