Cm Jagan: వైఎస్సార్ ఆసరా సాయం విడుదల

వైఎస్సార్ ఆసరా మూడో విడత సాయాన్ని సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో విడుదల చేశారు....

Update: 2023-03-25 13:19 GMT
Cm Jagan: వైఎస్సార్ ఆసరా సాయం విడుదల
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ ఆసరా మూడో విడత సాయాన్ని సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో విడుదల చేశారు. బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులు జమ చేశారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78 లక్షల 94 వేల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 6 వేల 419 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ప్రతి మండలంలో పండుగ వాతావరణం ఉంటుందని చెప్పారు. మహిళా సాధికారితకు ఇక్కడున్న మహిళలు అద్దంపడుతున్నారని జగన్ పేర్కొన్నారు. 45 నెలల కాలంలో మహిళల కోసం మార్పులు తీసుకొచ్చామన్నారు. 78 లక్షల మందికి పైగా అక్క చెల్లమ్మలకు మంచి జరుగుతోందని సీఎం జగన్ వెల్లడించారు. 

Tags:    

Similar News