కాకపుట్టిస్తున్న ఆంధ్ర రాజకీయాలు.. పండగ పూట ఫ్లెక్సీ వార్..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది.

Update: 2024-01-14 10:28 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతూ కాకాపుట్టిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో గెలుపే ద్యేయంగా ప్రతి పార్టీ అడుగులేస్తుంది. ముఖ్యంగా వైసిపి పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు ఆ పార్టీ నేతల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. వైసీపీ అధిష్టానం తీరుపై అసహనంతో ఉన్న చాలామంది నేతలు పార్టీ నుండి బయటకు వచ్చేసారు. మరి కొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే చాలామంది పక్క పార్టీల గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా నేతల మార్పులు చేర్పులతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

అయితే తాజాగా విజయవాడలో పండగ పూట ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పార్థసారథి, ఎంపీ కేసినేని నాని లక్ష్యంగా ఈ ఫ్లెక్సీల యుద్ధం నడుస్తోంది. ఈ రోజు పెనమలూరు జోగి రమేష్ ని కాదని సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ హోర్డింగులు పుట్టుకొచ్చాయి. కాగా లోకల్ వ్యక్తిగా ఉన్న పడమటి సురేష్ కు సీటు ఇవ్వాలని నియోజకవర్గమంతా ఫ్లెక్సీలు వెలిశాయి.. అయితే పెనమలూరులో పడమటి సురేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే నేపథ్యంలో ఎమ్మెల్యే పార్థసారథి ఫ్లెక్సీలన్నీ మున్సిపల్ సిబ్బంది తొలిగించింది. ఇక తిరువూరు లోనూ ఇదే ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్యన టీడీపీ నుండి బయటకు వచ్చిన ఎంపీ కేశినేని నానీ, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఫోటోలను ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు కట్ చేశారు. 

Tags:    

Similar News