దొంగలు వస్తున్నారు..నమ్మొద్దు: Minister Botsa

శృంగవరపుకోట వైసీపీ అడ్డా అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ...

Update: 2023-11-04 17:03 GMT
దొంగలు వస్తున్నారు..నమ్మొద్దు: Minister Botsa
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: శృంగవరపుకోట వైసీపీ అడ్డా అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోని శృంగవరపుకోట, గుంటూరు, ధర్మవరం ప్రాంతాల్లో సాగింది. ఈ యాత్రలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, అంజాద్ బాషా, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాల్‌, ఆదిమూలపు సురేష్, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మహ్మద్‌ ముస్తఫా షేక్‌, హఫీజ్ ఖాన్, కడుబండి శ్రీనివాసరావు, కంబాబ జోగులు, శంబంగి చిన అప్పల నాయుడు, అలజంగి జోగారావు, జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సామజిక సాధికార యాత్ర ఎలా సాగిందో చెప్పడానికి శృంగవరపుకోటలో తరలివచ్చిన జనమే నిదర్శనమన్నారు. 2014లో 600 హామీల మేనిఫెస్టో వేషంలో వచ్చి ఒక్కటి కూడా అమలు చేయని కూటమిని మనం చూశామమన్నారు. ఇప్పుడు మరో కొత్త కూటమి వేషంలో దొంగలు వస్తున్నారని, వారిని నమ్మవద్దన్నారు. కరోనా సమయంలో ప్రయివేట్ ఆస్పత్రుల్లో చనిపోయిన కేసులున్నాయి గానీ శృంగవరపుకోట ఆస్పత్రిలో ఒకరు కూడా మరణించలేదన్నారు. ఎన్నికల్లో ఏం చెప్పామో..పాలనలో ఏమి చేశామో ప్రజలకు చెప్పడానికే తాము వస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇష్టానుసారంగా హామీలిచ్చేసి ప్రజలను నుంచి పారిపోయే పరిస్థితి తమకు లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముసుగులు తీసి టీడీపీ, జనసేన దొంగలు వస్తున్నారన్నారని విమర్శించారు. ఎస్ కోటకి డీబీటీ ద్వారా రూ.1260 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1,000 కోట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం, ఇల్లు తీసుకోవాలంటే లంచం ఇవ్వాల్సి వచ్చేదన్నారు. పింఛన్ దారులు త్వరలోనే నెలకు రూ.3 వేల పింఛన్ తీసుకోబోతున్నారని తెలిపారు. రాక్షస పాలన సాగించే చంద్రబాబు కావాలో, సంక్షేమ పాలన సాగించే జగన్ కావాలో ఆలోచించాలన్నారు. అంతకుముందు అలమండలో జగనన్న కాలనీలో లబ్ధిదారుడు నిర్మించుకున్న గృహాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అలాగే స్థానికంగా ఉన్న సచివాలయాన్ని సందర్శించారు. 

Tags:    

Similar News