Pawan: ఎర్రమట్టి దిబ్బలను కాపాడండి..

విశాఖలో టూరిజం ముసుగులో రియల్ ఎస్టేట్ చేసేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు ఎర్రమట్టి దిబ్బలను ధ్వసం చేశారని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ ఆరోపించారు....

Update: 2023-08-16 15:40 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో టూరిజం ముసుగులో రియల్ ఎస్టేట్ చేసేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు ఎర్రమట్టి దిబ్బలను ధ్వసం చేశారని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారాహి యాత్రలో భాగంగా భీమిలిలో ఎర్రమట్టి దిబ్బలను ఆయన పరిశీలించారు. 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బలున్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు ఆస్తుల తరహాలో నిర్మాణాలకు వాడేందుకు రంగం సిద్దం చేయడం దారుణమన్నారు. శ్రీలంక, చెన్నై తరువాత విశాఖలో మాత్రమే ప్రఖ్యాతి గాంచిన ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయన్నారు. 20వేల సంవత్సరాల క్రితం ప్రకృతి సహజసిద్దంగా ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయన్నారు. 32 హెరిటేజ్ సైట్లతో చాలా వరకు అన్యాక్రాంతం కాగా.. 292 ఎకరాలు మిగిలిందన్నారు. ప్రభుత్వం దీనిని రక్షించకపోగా అన్యాక్రాంతం చేసేందుకు వైసీపీ నేతలు సహకరిస్తున్నారన్నారు. జాతిసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.ప్రభుత్వం స్పందించకపోతే గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని పవన్ హెచ్చరించారు. 

Tags:    

Similar News