అచ్యుతాపురం సెజ్ వద్ద ఉద్రిక్తత.. విచారణ జరపాలని కార్మిక సంఘాల డిమాండ్

అచ్యుతాపురం సెజ్‌ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు..

Update: 2024-08-21 13:06 GMT

దిశ, వెబ్ డెస్క్: అచ్యుతాపురం సెజ్‌ఎసెన్షియా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో కంపెనీలో మొదటి అంతస్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 300 మంది కార్మికులు పని చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. భద్రతా ప్రమాణాల లోపం వల్లే ఈ ఘటన జరిగిందని పడ్డారు. సెజ్‌లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ బోర్డు, ఫైర్ డిపార్ట్‌మెంట్ పట్టించుకోవడంలేదని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘‘భారీ ఎత్తున ప్రమాదం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక కార్మికులు పరుగులు తీశారు. అయినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాలి. సెజ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని చుట్టు ప్రాంతాల ప్రజలు క్షణం క్షణం భయపడుతున్నారు. కంపెనీలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.’’ అని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News