డ్రంక్ అండ్ డ్రైవ్ బాబులకు కోర్టు వినూత్న శిక్ష

విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు వినూత్న శిక్ష వేసింది.

Update: 2023-02-21 11:44 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో మందు బాబులకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వినూత్న శిక్ష వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 52 మంది మందు బాబులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మందుబాబులంతా సముద్ర తీరంలో ఉన్న వ్యర్ధాలను ఏరివేసి శుభ్ర పరచాలని కోర్టు శిక్షను విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 52 మంది మందుబాబులకు నగర పోలీసులకు వివిధ ప్రాంతాల్లో ముందు రోజు రాత్రి పట్టుబడ్డారు. అయితే వీరందరిని ప్రతిరోజూ లాగానే పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. వందో రెండొందలో అపరాధ రుసుం చెల్లించి బయటపడవచ్చు అనుకున్న మందుబాబులకు కోర్టు జలక్ ఇచ్చింది. ఆర్కే బీచ్ లోని వ్యర్ధాలను, చెత్తను పరిశుభ్రం చేయాలని ఆదేశించింది.

దీంతో ఆర్కే బీచ్ లోకి వచ్చిన మందు బాబులు పోలీసల సమక్షంలో చెత్తను శుభ్రం చేశారు. కాగా విశాఖ మెట్రోపాలిటిన్ కోర్టు వేసిన ఈ శిక్ష ఇపుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఫైన్లు వేస్తారు. ఆ తరువాత సీజ్ చేసిన మోటారు వాహనాలను ఫైన్లు కట్టి విడిపించుకుంటారు. కానీ విచిత్రంగా కోర్టు ఈ తరహా శిక్షలు వేయడంతో మందుబాబులకు తాగింది మొత్తం దిగిపోయింది. ఇలా శిక్షలు పడిన వారంతా బీచ్ లోదర్శనమిచ్చారు. చక్కగా చేతికి గ్లౌజులు వేసుకొని, పోలీసుల పర్యవేక్షణలో బీచ్ లోచెత్తను శుభ్రం చేశారు. మొత్తం మీద మందుబాబులకు కిక్కు దిగిపోయింది. ఈ వార్త విన్న జనం మాత్రం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News