Vizag:ఆర్కే బీచ్‌లో 'హ్యాండ్లూమ్ శారీ వాక్‌'..స్పెషల్ అట్రాక్షన్‌గా వెయ్యి మీటర్ల చేనేత చీర!

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో 'హ్యాండ్లూమ్ శారీ వాక్‌'ను ప్రారంభించారు.

Update: 2024-08-04 06:05 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో 'హ్యాండ్లూమ్ శారీ వాక్‌'ను ప్రారంభించారు. ‘ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 1000 మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు చీరకట్టులో వాక్ చేసి అలరించారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ..చీర కట్టడం మన సాంప్రదాయమని, చీరలోనే అమ్మతనం, కమ్మదనం ఉంటుందని పేర్కొన్నారు. భారతదేశం అంటేనే ప్రపంచమంతా గుర్తుకు వచ్చేది చీరకట్టు అన్నారు.

ఇందులో చేనేత చీరలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. చీరలో అమ్మతనం ఉట్టిపడుతుందని, భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. ప్రజెంట్ చేనేత రంగం సంక్షోభంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం తరఫున చేనేత కార్మికులకు అండగా నిలబడతామని ఆమె హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో చేనేత కార్మికులకు అన్ని పథకాలు అమలయ్యేలా చూస్తాం అని మంత్రి అనిత పేర్కొన్నారు.




 


Tags:    

Similar News