వైసీపీకి పట్టని మహిళల గోడు

సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ నేతల లీలలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీలో ప్రముఖుల లీలలకు అద్దం పట్టే విధంగా క్లుప్తంగా అనేక మేమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2024-08-11 02:31 GMT
వైసీపీకి పట్టని మహిళల గోడు
  • whatsapp icon

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:  ఒక్కోక్కటిగా వైసీపీ పార్టీ నేతల లీలలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీలో ప్రముఖుల లీలలకు అద్దం పట్టే విధంగా క్లుప్తంగా అనేక మేమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి చేసుకొని మరో మహిళతో వుంటూ కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై దాడికి దిగిన నేపథ్యంలో వైసీపీ పరువు మరోసారి మంటగలిసింది. మహిళలకు ఆ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా? అన్న చర్చ మరోసారి మొదలైంది.

పార్టీ జోక్యం చేసుకోదా?

మొన్నటి విజయసాయిరెడ్డి ఉదంతం కానీ, నేటి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కానీ వైసీపీని పార్టీ పరంగా బాగా బద్నామ్ చేసేవే. అయినా పార్టీ అధిష్టానం నోరుమెదపదు, జోక్యం చేసుకోదు. వివరణ ఇవ్వదు. ఖండన ఇవ్వదు. కనీసం పార్టీ నుంచి పెద్దలు ఎవరినైనా పంపి రాజీ ప్రయత్నాలు చేయదు. ఎవరు బాధలు వారే పడాలన్నట్లు చూస్తూ ఊరుకొంటుంది. అవంతి, అంబటి, గోరంట్ల వంటి వారి వ్యవహారుల బహిర్గతం అయినప్పటి నుంచి పార్టీ వైఖరి ఇదే. ప్రపంచ మహిళా దినోత్సవాలు పార్టీ పరంగా చేయడమే తప్ప పార్టీ ప్రముఖుల చేతుల్లో మహిళలు మోసపోయినప్పుడు అన్యాయానికి గురైనప్పుడు స్పందించడమే లేదు.

క్రమశిక్షణా చర్యలే లేవు

మహిళా వేధింపులు, ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నేతల విషయంలో మందలింపులు, క్రమశిక్షణా చర్యలను వైసీపీ అధిష్టానం తీసుకోవడం లేదు. ఈ కారణంగానే పార్టీ మహిళల విషయంలో పలచన అవుతుంది. తన వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గానికి ఆగ్రహం కలిగించాయంటే అప్పట్లో విజయవాడకు చెందిన పూనూరు గౌతం రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్న వైసీపీ మహిళల విషయంలో ఎవరిపైనా ఇప్పటి వరకూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

ఎవరి బాధలు వారు పడాల్సిందే

ఇటువంటి వ్యవహారాలను పార్టీ పరంగా డీల్ చేసి సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా పార్టీ చేయడం లేదు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి భర్త నుంచి దారుణ ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ నెంబర్ 2 విజయసాయిరెడ్డి తనంతట తాను విశాఖలో విలేకరుల సమావేశం పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఉత్తరాంధ్ర నేతలెవ్వరూ ఆ సమావేశంలో కనిపించలేదు. విజయసాయికి మద్దతుగా ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. ఇప్పుడు దువ్వాడ శ్రీను పరిస్థితీ అదే. పదే పదే ఆయన భార్య వైఎస్ జగన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నా పార్టీ పరంగా పెద్దలను పంపి చర్చలు, సర్దుబాట్లు జరిపే ప్రయత్నమే చేయడం లేదు. ఈ వైఖరి నేతలతో పాటు పార్టీ పరువు తీస్తున్న అధిష్టానం పట్టీ పట్టనట్టే వ్యవహరిస్తూ డ్యామేజ్‌ను మరింత పెంచుకొంటుందనే వాదనలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.


Similar News