Ap News: 2023-24 విద్యుత్ టారిఫ్ విడుదల
2023-24 విద్యుత్ టారిఫ్‌ను విద్యుత్ నియంత్రణ మండలి విడుదల చేసింది...
దిశ, వెబ్‌డెస్క్: 2023-24 విద్యుత్ టారిఫ్‌ను విద్యుత్ నియంత్రణ మండలి విడుదల చేసింది. డిస్కంల ప్రతిపాదనలపై ప్రజాప్రాయసేరణ చేపట్టినట్లు తెలిపింది. అయితే సబ్సిడీ వల్ల మూడు డిస్కంలకు రూ.10,135 కోట్ల లోటు ఉన్నట్లు పేర్కొంది. లోటును భరించేందుకు అటు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించింది. వినియోగదారులపై భారం వేయాల్సిన అవసరంరాలేదని తెలిపింది. సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరిలో అదనపు చార్జ్‌లు లేవని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి తెలిపారు. హెచ్‌టీ వినియోగదారులకు కిలో వాట్‌కు రూ.475 అదనపు డిమాండ్ చార్జ్ ప్రతిపాదనను అంగీకరించామని పేర్కొన్నారు. మిగతా ప్రతిపాదనలను తిరస్కరించామని నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు.