Apలో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు

ఏపీలో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖలో అమెజాన్ సంస్థ తన డెవలప్‌మెంట్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది....

Update: 2022-12-19 13:53 GMT
  • రూ. 184.12 కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్
  • దశల వారీగా పెట్టుబడులను విస్తరించనున్న అమెజాన్
  • అమెజాన్ ఏపీ ఎంట్రీపై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖలో అమెజాన్ సంస్థ తన డెవలప్‌మెంట్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఫెసిలిటీ సెంటర్ కోసం విశాఖలో రూ.184.12 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెజాన్ పెట్టుబడుల కోసం ప్రాథమిక నిర్ణయం పూర్తై సాఫ్టవేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. నూతన సంవత్సరంలో నూతన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. ఈ మేరకు అమెజాన్ సంస్థ పెట్టుబడులపై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్వయంగా ట్వీట్ చేసింది. డెవలప్ మెంట్ సెంటర్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగాలతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Tags:    

Similar News