కాపులు అవసరం టీడీపీకి లేదా: ప్రగడ నాగేశ్వరరావు
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. తాజాగా టీడీపీ, జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదల అయింది...
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. తాజాగా టీడీపీ, జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదల అయింది. అయితే అనకాపల్లి, యలమంచిలి సీట్లు జనసేనకు కేటాయించారు. దీంతో అనకాపల్లి టీడీపీ ఇంచార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులు అవసరం టీడీపీకి లేదా అని ఆయన ప్రశ్నించిరు. అనకాపల్లి జిల్లాలో టిడిపి తరఫున ఒక్క సీటు కాపుకు ఇవ్వక పోవడం దారుణమని మండిపడ్డారు. యలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ప్రగడ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
Read More..
జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కొండపల్లి శ్రీనివాస్
కాపులు అవసరం టిడిపికి లేదా - ప్రగడ నాగేశ్వరరావు టిడిపి ఇన్చార్జ్.
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2024
అనకాపల్లి జిల్లాలో టిడిపి తరఫున ఒక్క సీటు కాపుకు ఇవ్వక పోవడం దారుణం. ఎలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు..చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..… pic.twitter.com/BLleMSnp4O