విశాఖ రైల్వే జోన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి: రాజ్యసభలో ఎంపీ జీవీఎల్

విశాఖపట్నం రైల్వే జోన్‌ను తక్షణమే అమలు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.

Update: 2023-12-04 14:14 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం రైల్వే జోన్‌ను తక్షణమే అమలు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు అనేక దశాబ్దాలుగా విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ప్రధాన డిమాండ్ మరియు భావోద్వేగ సమస్య అని తెలిపారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రతిపాదనకు 2019 ఫిబ్రవరి 28న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అని గుర్తు చేశారు. ‘కొత్త రైల్వే జోన్ ఏర్పాటు రైల్వే కార్యకలాపాల పరిమాణం మరియు స్కేల్‌కు సంబంధించి అనుకూలతను తెస్తుంది మరియు ఈ ప్రాంత ప్రజల నిరంతర డిమాండ్ మరియు ఆకాంక్షలను తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది’అని అప్పటి భారత ప్రభుత్వ పత్రికా ప్రకటనలో తెలియజేశారు అని గుర్తు చేశారు. విశాఖపట్నంలో రూ.106 కోట్లతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు రైల్వే బోర్డు గత నెలలో సమగ్ర అంచనాలను మంజూరు చేసిందన్నారు. డిజైన్లు మంజూరైన తర్వాత కొత్త విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను ఈస్ట్ కోస్ట్ జోన్ అధికారులకు అప్పగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా విశాఖపట్నంలోని ముడిసర్లోవ ప్రాంతంలో ప్రతిపాదిత విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 52 ఎకరాల భూమిని అప్పగించడంలో విపరీతంగా జాప్యం చేస్తోంది అని రాజ్యసభలో ప్రస్తావించారు.పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించి, వచ్చే రెండు నెలల్లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత కొన్ని నెలల్లో విశాఖపట్నం ప్రధాన కార్యాలయంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఎంపీ జీవీఎల్ నరసింహరావు కోరారు.

Tags:    

Similar News