AP High Court: కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి బిగ్ షాక్.. ఆ పిటిషన్ కొట్టివేత
వైసీపీ సర్కార్ (YCP Government) హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajashekar Reddy)కి ఏపీ హైకోర్టు (AP High Court) షాకిచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్ (YCP Government) హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajashekar Reddy)కి ఏపీ హైకోర్టు (AP High Court) షాకిచ్చింది. కేసులో వెంటనే విచారణకు హాజరు కావాలంటూ ఇటీవలే కసిరెడ్డికి సీఐడీ (CID) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. తనపై నమోరైన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు. ఈ మరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపటి ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. సీఐడీ (CID) అధికారులు ఇచ్చిన నోటీసులపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది తదుపరి నోటీసు జారీ చేసి విచారణకు పిలిచే ముందు పటిషనర్‌కు కాస్త సమయం ఇవ్వాలని దర్యాస్తు సంస్థ అధికారులను హైకోర్టు ఆదేశించింది.