Dussehra 2024: దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఏ రోజు ఏ అవతారంలో దర్శనమిస్తారంటే..

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపకాంతులతో మెరిసిపోతున్న అమ్మవారి ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు.

Update: 2024-10-02 06:14 GMT

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేశమంతా దసరా ఉత్సవాలకు సిద్ధమవుతోంది. దసరా వేడుకలంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చేది విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లి. దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారు 10 రోజులు 10 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఈ సమయంలో అమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధికంగా వస్తారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాలపై మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు. దేవీనవరాత్రుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పవిత్రసంగమం ఘాట్ లో పవిత్ర హారతులను పునరుద్ధరించామని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన సత్రంలో నిత్యాన్నదానం కొరత లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపకాంతులతో మెరిసిపోతున్న అమ్మవారి ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. శరన్నవరాత్రులు ప్రారంభం కాకుండానే.. ఆలయానికి భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి, ముల్లోకాలకు మూలమైన తల్లిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. రేపు ఘట స్థాపనతో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

10 రోజులు.. 10 అలంకారాలు

అక్టోబర్ 3 - ఆశ్వీయుజ శుద్ధపాడ్యమి - శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం

అక్టోబర్ 4 - ఆశ్వీయుజ శుద్ధ విదియ - శ్రీ గాయత్రీ దేవి అలంకారం

అక్టోబర్ 5 - ఆశ్వీయుజ శుద్ధ తదియ - శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం

అక్టోబర్ 6 - ఆశ్వీయుజ శుద్ధ చవితి - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం

అక్టోబర్ 7 - ఆశ్వీయుజ శుద్ధ పంచమి - శ్రీ మహాచండీ దేవి అలంకారం

అక్టోబర్ 8 - ఆశ్వీయుజ శుద్ధ పంచమి, షష్ఠి - శ్రీ మహాలక్ష్మీ అలంకారం

అక్టోబర్ 9 - ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి, సప్తమి - శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూల నక్షత్రం)

అక్టోబర్ 10 - ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, అష్టమి - శ్రీ దుర్గాదేవి అలంకారం (దుర్గాష్టమి)

అక్టోబర్ 11 - ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, నవమి - శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం (మహర్నవమి)

అక్టోబర్ 12 - ఆశ్వీయుజ శుద్ధ దశమి - శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం (విజయ దశమి)




 



Similar News