Pawan Kalyan:విజయవాడ దుర్గమ్మ ఆలయం మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం.. కారణం ఏంటంటే?
ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం పై మొదట్లోనే తప్పును గుర్తించలేకపోయాను క్షమించు స్వామీ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం మెట్లను పవన్ శుభ్రం చేశారు. అనంతరం వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి శుద్ధి చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) వారాహి సభ నిర్వహించనున్నట్లు సమాచారం.