స్థలం రెడీ.. 12 రోజుల్లో ఇచ్చేస్తాం: Mp Vijayasai Reddy

పరిశ్రమలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం ముందుంటుందని ఏపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు...

Update: 2023-02-25 16:32 GMT

దిశ, ఏపీ బ్యూరో: పరిశ్రమలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం ముందుంటుందని ఏపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సువిశాల సముద్రతీరం, పుష్కలమైన వనరులు, నైపుణ్యత కల్గిన మానవ వనరులు, వ్యాపారులకు ప్రభుత్వ తోడ్పాటు తదితర అంశాలు పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు స్థలం మాత్రమే కాకుండా సగటున 12 రోజుల్లో అనుమతులు కూడా లభిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం 48 వేల ఎకరాలకు పైగా స్థలం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంకావాలని ఇంధన శాఖ సమీక్షలో సీఎం జగన్ అధికారులను అదేశించారని విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే రైతులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం జరగకుడదని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 దేవాలయాలు అభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని, ఒక్కో దేవాలయం రూ.10 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News