నాగలి పట్టి పొలం దున్నిన ఎంపీ.. వైరల్ అవుతోన్న వీడియో!
ఏపీ(Andhra Pradesh)లో ఉగాది(Ugadi) వేడుకలు ఘనంగా జరుగుతాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఉగాది(Ugadi) వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఉదయాన్నే నిద్రలేచి తమ ఇష్ట దైవ దర్శనానికి భక్తులు(Devotees) ఆలయాలలో క్యూ కడుతున్నారు. ఈ ఏడాది అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు. ఈ ఉగాది నుంచి తెలుగు సంవత్సరాది ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాంగ శ్రవణం వింటున్నారు.
ఇదిలా ఉంటే.. ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం(Vizianagaram) ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(MP Kalisetti Appalanaidu) తన వ్యవసాయ పొలంలో ఏరువాక సేద్యం చేపట్టారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వీఎన్‌పురంలోని పొలం వద్దకు వెళ్లారు. ఈ తరుణంలో ఎద్దులు, నాగలిని పూజించారు. అనంతరం ఎద్దులకు నాగలి కట్టి భూమిని దున్నారు. ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో ఎంపీ పొలం దున్నిన వీడియో వైరల్‌గా మారింది.
మీడియాతో మాట్లాడుతూ ఎంపీ కలిశెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా తొలిసారి ఏరువాక నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. రైతులు, ప్రజలు అందరూ సుఖ సంతోషలతో ఉండాలన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం(AP Government) కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.