టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి
2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం హోదాలో తిరుపతికి వచ్చిన చంద్రబాబు నాయుడు తిరుపతి పవిత్రతను కాపాడుతానని హామీ ఇచ్చారు.
దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం హోదాలో తిరుపతికి వచ్చిన చంద్రబాబు నాయుడు తిరుపతి పవిత్రతను కాపాడుతానని హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, రాష్ట్రంలో గత ప్రభుత్వం అచాకపాలకు తిరుపతి నుంచే ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 2005 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి, వెంకయ్యను డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో తిరుపతి జేఈవోగా నియమించారు. కాగా ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీ గా పనిచేశారు.