Kakinada Port:స్టెల్లా షిప్ నుంచి రేషన్ బియ్యం అన్‌లోడ్

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతోంది.

Update: 2024-12-29 08:26 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతోంది. బియ్యం అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో కాకినాడ(Kakinada)లో స్టెల్లా షిప్‌లో ఇటీవల భారీ మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణా పై ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రేషన్ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేశారు. మొత్తం 1.320 టన్నుల బియ్యాన్ని పోర్టులోని గోడౌన్‌లో భద్రపరిచారు. మరోవైపు స్టెల్లా షిప్‌లో 19,785 టన్నుల బియ్యం లోడ్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా(Smuggling of ration rice) జరుగుతోందనే ఆరోపణలతో గత నెల(నవంబర్) 11 నుంచి స్టెల్లా నౌకను కాకినాడలో నిలిపి ఉంచారు.

Tags:    

Similar News