AP News:ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ దాడులు:ఎంపీ బస్తీ పాటి నాగరాజు

ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులను హత మారుస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తీ పాటి నాగరాజు మండిపడ్డారు.

Update: 2024-08-14 12:10 GMT

దిశ ప్రతినిధి,కర్నూలు:ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులను హత మారుస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తీ పాటి నాగరాజు మండిపడ్డారు. పత్తికొండ మండలం హోసూరులో హత్యకు గురైన మాజీ సర్పంచ్, టీడీపీ నేత శ్రీనివాసులు మృతదేహాన్ని, హత్య జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ పార్టీతో పాటు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ టీడీపీ నేత హత్యను ఖండిస్తున్నానని, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకులు, కార్యకర్తల పై దాడులకు దిగుతున్నారన్నారు. ఇక ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించిన ఎంపీ, శ్రీనివాసులును హత్య చేసిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


Similar News