తిరుమల కొండపై కొత్త వివాదం..

తిరుమల కొండపై ఇటీవల కొత్త వివాదం నెలకొంది. తిరుమల కొండపైకి రామానుజుల విగ్రహాన్ని తీసుకెళ్లి ఊరేగించాలని ప్రయత్నించారు.

Update: 2023-05-04 15:04 GMT

దిశ, తిరుపతి: తిరుమల కొండపై ఇటీవల కొత్త వివాదం నెలకొంది. తిరుమల కొండపైకి రామానుజుల విగ్రహాన్ని తీసుకెళ్లి ఊరేగించాలని ప్రయత్నించారు. దీన్ని టీటీడీ అధికారులు అడ్డుకున్నారు. రామానుజుల వారే వెంకటేశ్వర స్వామి వారికి కైంకర్యాలు చేయడంలో నిర్దేశకులు అలాంటి రామానుజుల విగ్రహాన్ని తిరుమలలో ఊరేగిస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగారు. తిరుమల కొండ పై హిందు దేవుళ్ల విగ్రహాల ఊరేగింపును అడ్డుకుంటారా మీరెవరూ అంటూ బీజేపీ నాయకులు కూడా టీటీడీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. తిరుమల కొండపై వేరే దేవుళ్లకు సంబంధించి ఏ ఊరేగింపులు నిర్వహించరు. వెంకటేశ్వర స్వామి తప్పా తిరుమల కొండపై ఇంకొకరిని దేవుడిగా పూజించడం కానీ.. ఆ విగ్రహాల ఊరేగింపు చేయడం కానీ కుదరవు అనేది టీటీడీ చెబుతున్న మాట.

తిరుమలలో కల్యాణాలు, ఊరేగింపులు ఇలా ప్రతిదీ ఆ వెంకన్న స్వామివే జరగాలి. ఇఫ్పటి వరకు అలాగే జరుగుతున్నాయి. కానీ సమతా మూర్తి విగ్రహం ఊరేగిస్తాం.. రేపు మరో దేవుడి ప్రతిమను తీసుకొస్తాం అంటే కుదరదని టీటీడీ అధికారులు తెగేసి చెప్పారు. ఇదిలా వుండాగా గతంలోనూ సమతా మూర్తి లాంటి విగ్రహాలను తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ఆపుతున్నారో తెలియడం లేదంటూ చిన్న జీయర్ స్వామికి సంబంధించిన ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తిరుమలతిరుపతి దేవస్థానం అనగానే ఏడుకొండల వాడు, శ్రీనివాసుడు, వెంకటేశ్వర స్వామి అనే పేర్లు మాత్రమే టక్కున భక్తులకు గుర్తుకు వస్తాయి. అలాంటిది తిరుమలలో సమతా మూర్తి పేరుతో రామానుజుల విగ్రహాన్ని ఊరేగిస్తామనడం వెంకటేశ్వర స్వామిని చిన్న చూపు చూసినట్లే అని కొంత మంది భక్తులు ఆవేదన చెందుతున్నారు.


Tags:    

Similar News