Thanthadi Beach: సముద్ర స్నానానికి వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది....
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో జరిగింది. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు నూకరత్నం, కనకదుర్గ మరొకరితో కలిసి ఈ రోజు మధ్యాహ్నం తంతడి బీచ్‌కు వెళ్లారు. ఈ ముగ్గురు సముద్ర స్నానానికి వెళ్లారు. అయితే కొద్ది సేపటికి అలలలో కొట్టుకుపోయారు. అందరూ చూస్తుండగా వీళ్లు నీళ్లలో మునిగిపోయారు. నీళ్లలో ఊపిరాడక ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న బీచ్ పోలీసులు.. అక్కా చెల్లెళ్ల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. మరొకరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే 24 గంటలు గడిస్తే గాని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తీడ గ్రామంలో తెలియడంతో విషాద ఛాయలు అలుముకున్నారు. ఎంతో చలాకీగా కనిపించే అక్కా చెల్లెళ్లు ఇక లేరని తెలియడంతో అటు గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు.