CM Chandrababu: ఏ ఇజం లేదు.. టూరిజమే.. సీఎం చంద్రబాబు
ఏ ఇజం లేదు.. టూరిజమే.. అని తాను నాడు చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏ ఇజం లేదు.. టూరిజమే.. అని తాను నాడు చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు (Cm Chandrababu) గుర్తు చేసుకున్నారు. తన మాటలు, ఆలోచనలు అర్ధం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందన్నారు. చంద్రబాబు నాడు చెప్పిన మాటే నిజమంటూ తెలంగాణ సభలో అక్కడి ఎమ్మెల్యే కూనంనేని చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకంపై చంద్రబాబు చేఏసి వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తను చదివి వినిపించారు. ఏపీ సచివాలయంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం (Collector meeting) జరుగుతోంది. ఈ సందర్భంగా టూరిజంపై (Tourism) చంద్రబాబు సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ ఇప్పుడు అంత సమయం లేదు.. త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నారు. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాలన్నారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పీ4పై జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళిక, సమస్యలపై కలెక్టర్ల ప్రజంటేషన్ఇచ్చారు. ప్రతి జోన్లో కలెక్టర్ప్రజెంటేషన్ అనంతరం సీఎం చంద్రబాబు స్పందిస్తారు.