Thirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి!
బ్రహ్మోత్సవాలకు ముందు తిరుమలలో అపశృతి చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: బ్రహ్మోత్సవాలకు ముందు తిరుమలలో అపశృతి చోటు చేసుకుంది. గరుడ పటాన్ని ఎగురవేసే ఇనుప కొక్కి విరిగి కింద పడింది. తిరుమలలో ఇవాళ సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు గరుడ పటాన్ని ఎగురవేసే ఇనుప కొక్కెం అకస్మాత్తుగా విరిగి పడింది. ధ్వజస్తంభంపై ఉండే ఈ ఇనుప కొక్కి ద్వారా ఆలయ అర్చకులు గరుడ పటాన్ని ఎగుర వేస్తారు. దీంతో టీటీడీ అర్చకులు మరమ్మత్తు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రధాన ధ్వజస్తంభం పైకి ఎక్కి ఇనుప కొక్కిని బిగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రోజు సాయంత్రం ఈ కొక్కి ద్వారానే గరుడ పటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు ధ్వజస్తంభంపై ఆలయ అర్చకులు గరుడ పటాన్ని ఎగురవేస్తారు.