రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం రోజుల పాటు ఈ ట్రైన్స్ రద్దు
ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ జారీ చేసింది. భద్రతా
దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ జారీ చేసింది. భద్రతా పరమైన ఆధునీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గుంటూరు-విశాఖపట్నం(17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి-విశాఖ(07466), విశాఖ-రాజమండ్రి(07467) ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇక విశాఖ-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 7వ తేదీ నుంచి 13 వరకు రద్దు చేశారు.
అటు దీపావళి సందర్బంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చెన్నై సెంట్రల్-భువనేశ్వర్(06073), భువనేశ్వర్-చెన్నై సెంట్రల్(06074), సూరత్-బ్రహ్మపుర(09069), బ్రహ్మపుర-సూరత్(09070) మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఇవి సర్వీసులు అందించనున్నాయి.