సంక్షేమ పథకాలకే డబ్బులేదు.. రోడ్లెక్కడేయమంటారు.. మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు
సంక్షేమ పథకాలకే డబ్బులేదు.. రోడ్లెక్కడేయమంటారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : సంక్షేమ పథకాలకే డబ్బులేదు.. రోడ్లెక్కడేయమంటారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి పనులు ఇప్పట్లో పూర్తి చేయలేమని పేర్కొన్నారు. అప్పటి వరకు జనం ఓపికగా కష్టాన్ని భరించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు గ్రామంలో నిర్మించిన రెండు నూతన సచివాలయ భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనం రోడ్లెక్కగానే తనను తిడుతున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేశామని, అయితే కాంట్రాక్టర్ కొంత వరకే పని చేసి చెల్లింపులు చేయాలని అడుగుతున్నాడని తెలిపారు. సంక్షేమ పథకాలకే డబ్బు లేదు.. రోడ్లెక్కకడేయమంటారు అని అన్నారు. మీరు ఓటు వేసినా.. వేయకపోయినా రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆ లోపల అక్కడక్కడ రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.