AP News : బహిరంగ సభలో సీఎం చంద్రబాబును ప్రశ్నించిన మహిళ?
రాష్ట్ర వ్యాప్తంగా నేడు సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు బహిరంగ సభలో సమావేశమయ్యారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నేడు సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు బహిరంగ సభలో సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో ఓ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. మొన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో లేదని, పెనుమాక సభలో ఓ మహిళ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం చంద్రబాబు నవ్వుతూ సమాధానమిచ్చారు. జూలైలో వర్షాలు వస్తాయి. డిసెంబర్‌లో ప్రారంభిస్తే మళ్లీ మే లో పూర్తి చేయాల్సి ఉంటుంది. గోదావరి నది వరదల కారణంగా ఏడాదిలో 6 నెలలే పనులు జరుగుతాయి. గత ప్రభుత్వం 2 ఏళ్లు పట్టించుకోకపోవడంతో డయాఫ్రవాల్, కాపర్ డ్యాం దెబ్బతిన్నాయని సూచించారు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. నివేదిక ఇస్తారు అని సీఎం చంద్రబాబు వివరించారు.