Tungabhadra River:పరవళ్ళు తొక్కుతున్న తుంగభద్ర నది.!
కోసిగి మండల పరిధిలోని కందుకూరు సమీపాన ఉన్న (రాజోలి డైవర్షన్స్ స్కీమ్) ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద నీరు చేరింది.
దిశ, మంత్రాలయం రూరల్/కోసిగి: కోసిగి మండల పరిధిలోని కందుకూరు సమీపాన ఉన్న (రాజోలి డైవర్షన్స్ స్కీమ్) ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద నీరు చేరింది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం నుంచి వరద నీరు భారీగా వస్తుంది. మంగళవారం మత్స్యశాఖ అసిస్టెంట్ చంద్రకళ, ఇరిగేషన్ అధికారులు ఆర్డీఎస్ను పరీక్షించి నది తీరప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం అటు తుంగభద్ర స్టేషన్, మాధవరం బ్రిడ్జి వద్ద వరద నీరు చేరికతో ప్రమాదకర ప్రాంతాలలోకి మత్స్యకారులు వెళ్లరాదని హెచ్చరించారు.