వైసీపీ అక్రమ కట్టడాలపై ఏపీ ప్రభత్వం ఉక్కుపాదం.. ఆ జిల్లా పార్టీ కార్యాలయానికి నోటీసులు..

అధికారం ముసుగులో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు ప్రస్తుతం ఏ నిమిషాన ఏం జరుగుతుందోనని భయంభయంగా కాలం గడుపుతున్నారు.

Update: 2024-06-28 06:09 GMT

దిశ వెబ్ డెస్క్: అధికారం ముసుగులో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు ప్రస్తుతం ఏ నిమిషాన ఏం జరుగుతుందోనని భయంభయంగా కాలం గడుపుతున్నారు. అయితే ఐదేళ్లు అవమానాలతో కాలం వెళ్లదీసిన టీడీపీ నేతలు ప్రస్తుతం అధికారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని అందరూ అనుకున్నారు. కాని అలా జరగలేదు.

దీనికి కారణం టీడీపీ నేతలు, కార్యకర్తు ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని, అలా ఎవరైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చిరించడమేనని తెలుస్తోంది. అయితే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై మాత్రం కూటమి ప్రభుత్వం ఉక్కపాదం మోపుతోంది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్దంగా అనుమతులు లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ 26 జిల్లాల్లో వైసీపీ నిర్మించిన ప్యాలెస్ తరహా పార్టీ కార్యాలయాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఇప్పటీకే పలు వైసీపీ ఆఫీసులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లా మచిలీపట్నం వైసీపీ కార్యాలయానికి సైతం మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. కాగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవటంతో కార్యాలయ సిబ్బందికి అధికారులు నోటీసులు ఇచ్చారు.


Similar News