అర్ధరాత్రి బాలికపై లైంగికదాడి..ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి సీరియస్

ఏలూరు జిల్లాలోని న్యూజివీడు మండలం పల్లెర్లుమూడిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది.

Update: 2024-08-05 14:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలోని న్యూజివీడు మండలం పల్లెర్లుమూడిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలికను ఓ వ్యక్తి రాత్రి 11 గంటలకు ఎత్తుకెళ్లాడు. స్థానిక పామాయిల్ తోటలోకి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి ఆమెను అక్కడే వదిలి వెళ్లాడు. రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో  బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తూ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Similar News