చిక్కడు.. దొరకడు: మాజీ మంత్రి కాకాణి కేసులో తాజా ట్విస్ట్ ఏంటంటే..!
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది..
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుంటే మరోవైపు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా(Nellore District) పొదలకూరు మండలం తాటిపర్తి(Tatiparthi)లో రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్(Quartz) దోపిడీ చేశారని కాకాణిపై కేసు(Case) నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. కానీ కాకాణి మాత్రం విచారణకు హాజరుకాకుండా కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
కాగా వైసీపీ సర్కార్(Ycp Government) హయాంలో మంత్రిగా పని చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అధికారంలో ఉండటంతో చర్యలపై ముందగు పడలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు టీడీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏ4గా చూపారు. దీంతో ఆయన్ను విచారించేందుకు పోలీసులు.. నెల్లూరుతో పాటు హైదరాబాద్(Hyderabad)లోనూ గాలిస్తున్నారు. ఈ సమయంలో ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. తన తరపున లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు.