ఏపీలో మరో కొత్త విధానం.. ఇక అనుమతులు ఈజీ
ఏపీలో మరో కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో భవన నిర్మాణాలకు అనుమతులతో పేరుతో ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవన నిర్మాణ యజమానుల బాధతలను అర్ధం చేసుకున్న కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్ల ప్లాన్ సమర్పిస్తే చాలని ప్రకటించింది. ఆ ప్లాన్ ప్రకారమే భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ.. భవన నిర్మాణ ప్రక్రియను మున్సిపల్ అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. దేశంలోనే మొదటిసారి భవన నిర్మాణ అనుమతులకు ఆన్‌లైన్ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. భవన నిర్మాణ అనుమతులను మరింత మెరగుపర్చేందుకు కొత్త విధానానికి రూపకల్పన చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.