సోషల్ మీడియాలో అరాచకాలు.. యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర అసెంబ్లీకి 2024 లో జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయం సాధించింది.

Update: 2024-11-08 04:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర అసెంబ్లీకి 2024 లో జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయం సాధించింది. నాటి నుంచి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. పలువురు సోషల్ మీడియా(social media)లో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజల నుంచి, రాజకీయ నేతలను వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ.. అసభ్యకర పోస్టులు(Indecent posts) పెడుతున్నారు. అలాగే తప్పుడు సమాచారాలను ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలపై ఏపీ ప్రభుత్వం(AP Govt) యుద్ధం ప్రకటించింది. సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల(Special teams) ద్వారా నిఘా ఏర్పాటు చేసింది. ఎవరైన అసత్యాలను, అడ్డగోలు పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి BNSS 179 కింద నోటీసులు జారీ చేసింది. గత కొంత కాలంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న.. సుమారు 15 వేల అకౌంట్లను పోలీసులు గుర్తించారు. త్వరలోని వారికి లుక్‌ ఔట్‌ నోటీసులు(Look out notices) ఇస్తామని హోంశాఖ చెప్పుకొచ్చింది.


Similar News