‘P4 లోని అంశాలు కేంద్రం ఆలోచనలోనివే’.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
డబుల్ ఇంజను సర్కార్ ద్వారా ప్రగతి సాధ్యం అవుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.
దిశ,వెబ్‌డెస్క్: డబుల్ ఇంజను సర్కార్ ద్వారా ప్రగతి సాధ్యం అవుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అభివ్రద్ధికి తావులేకుండా వైసీపీ పాలన సాగిందని పురందేశ్వరి మండిపడ్డారు. గత వైసీప ప్రభుత్వం అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసిందన్నారు. రహదారులను అధ్వాన్న స్థితికి చేర్చింది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి దక్కలేదు. మద్యం మాఫియాతో వైసీపీ నేతలు భారీగా డబ్బులు చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో రాష్ట్రాభివృద్ది సాధ్యమవుతుందన్నారు.
దేశానికి ఎన్డీయే కూటమి సుపరిపాలన అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇక రాష్ట్రం విషయంలోనూ మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ఇచ్చారు. అమరావతి రాజధానికి రూ.12,500 కోట్లు ఏడీబీ నుంచి, రూ.11వేల కోట్లు హడ్కో నుంచి ఇస్తున్నారు. గుంతలమయమైన రహదారుల బాగుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పంచాయతీ రాజ్ కు రూ.4,800 కోట్లు ఇచ్చారు. రూ.7,200 కోట్లు టాక్స్ డివల్యూషన్ గా నిధులు విడుదల చేశారు.
కేంద్రం వద్దకు వెళ్లి సీఎం చంద్రబాబు ఏం కోరితే వాటిని అర్థం చేసుకుని సహకరిస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పీ 4 కార్యక్రమం ప్రారంభించింది. పీ 4లోని ముఖ్యమైన అంశాలు కేంద్రం ఆలోచన లక్ష్యాల లోనివే అన్నారు. పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉంది. ఎంఎస్ఎంఈకి కేంద్రం సహకారం అందిస్తోంది. దేశంలోని 500 టాప్ కంపెనీలు కోటి మందికి ఉపాధి చూపాలని మోడీ కోరారు. రాష్ట్రంలోని పేదలకు ధనవంతులు చేయూత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని ఆమె అన్నారు.