నగ్న వీడియోల ఎఫెక్ట్.. ఏపీ బీజేపీ నేతల రాజీనామాలు

సోషల్ మీడియాలో కలకలం రేపిన ఏపీ బీజేపీ నేతల నగ్న వీడియోల ఎఫెక్ట్ వారి పదవులపై పడింది.

Update: 2024-10-10 13:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో కలకలం రేపిన ఏపీ బీజేపీ నేతల నగ్న వీడియోల ఎఫెక్ట్ వారి పదవులపై పడింది. గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ల నగ్న వీడియోలు గత రెండు రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన రాష్ట్ర నాయకత్వం.. వారిపై అంతర్గత విచారణ జరిపి, రాజీనామాలు చేయించింది. కాగా గురువారం సాయంత్రం వారు ఇరువురు నేతలు వారి పదవులకు రాజీనామాలు చేయగా, బీజేపీ రాష్ట్ర శాఖ వాటిని ఆమోదించిది. కాగా సదరు వీడియోల్లో ఉన్న బీజేపీ మహిళా నేతను పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.


Similar News